Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత

- Advertisement -

ముగ్గురు ఆడపిల్లల పేరున రూ.15 లక్షల ఫిక్సిడ్‌ డిపాజిట్‌
అందచేసిన ఎక్సైజ్‌ కమిషనర్‌ సీ హరికిరణ్‌


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఉప్పల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో కొండూరు రవికుమార్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కరెంటు షాక్‌తో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి చలించిన 2014 బ్యాచ్‌ కానిస్టేబుళ్లు, రంగారెడ్డి డివిజన్‌ ఎక్సైజ్‌ అధికారులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రవికుమార్‌ కుమార్తెలు యశస్వీ, అనుశ్రీ, సూర్యశ్రీ పేర్లపై ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున రూ.15 లక్షలు ఫిక్సిడ్‌ డిపాజిట్లు చేశారు.

రవికుమార్‌ తల్లి లక్ష్మమ్మ పేరుపై రూ.2 లక్షల పోస్టల్‌ బాండ్లు ఇచ్చారు. వీటిని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సీ హరికిరణ్‌ బుధవారం వారికి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్సైజ్‌ సిబ్బంది సహాయాన్ని ప్రసంసించారు. ఈ కార్యక్రమంలో మృతుడు రవికుమార్‌ భార్య రామానుజ, ఎక్సైజ్‌శాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ పి దశరథ్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌లు ఫయాజుద్దీన్‌, నవీన్‌, ఉజ్వలరెడ్డి, కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -