Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

- Advertisement -

• మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్ 
నవతెలంగాణ -పెద్దవంగర
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏపీఎం ఎండీ పాషా అన్నారు. మండలంలోని బొమ్మకల్, కొరిపల్లి, ఉప్పెరగూడెం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు తాము కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్రింటాలుకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369గా ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.

సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో లు యశస్విని, రాజు, సీసీ లు సుధాకర్, సుజాత, ఉమా, కంప్యూటర్ ఆపరేటర్ నూకల అనిల్, వీవోఏ లు, సెంటర్ నిర్వాహకులు, రైతులు రంగు శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -