ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి..
పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరిధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి,తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. మండలంలోని కొయ్యుర్, వళ్లెంకుంట, ఎడ్లపల్లి,కొండంపేట గ్రామాల్లో తాడిచెర్ల పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లర్లు కోత విధిస్తున్నారనే ఆరోపణలు రాకుండా నిర్వాహకులు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లకవత్ సవేందర్, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, ఏఓ శ్రీజ, పిఏసిఎస్ మేంబర్స్, మంథని మార్కెట్ డైరెక్టర్లు, వ్యవసాయ, పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



