- Advertisement -
- – కొనుగోలు కేంద్రాల్లో మధ్య దళారీలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు తప్పవు
– తొర్రూరు సొసైటీ చైర్మన్ మైసిరెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని తొర్రూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి అన్నారు. మండలంలోని శాతాపురంలో తొర్రూరు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ రిజిస్టార్ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి దివ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మైసిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని మధ్య దళారీలు కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని తెలిపారు. తేమశాతం 17 మించరాదని, తాలు లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. - సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ అందజేస్తుందని అన్నారు. రైతు సంక్షేమం కోసమే సజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని, కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ రందన్ నాయక్, పాలకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, తొర్రూరు సొసైటీ డైరెక్టర్ ఐలేని నర్సమ్మ, సొసైటీ సీఈవో మాసంపల్లి రణధీర్, పసులాది నాగరాజు, మార్కెట్ డైరెక్టర్ పసులాది యాకయ్య, మాజీ ఉపసర్పంచ్ మారుజోడు సంతోష్, పాలకుర్తి దేవస్థాన మాజీ డైరెక్టర్ లోని శ్రీనివాస్, నాయకులు ఏలూరి యాకన్న, గన్న శ్రీనివాస్, ఏలూరి కృష్ణమూర్తి, నాయిని నర్సిరెడ్డి, సొసైటీ సిబ్బంది రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -