Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర 

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర 

- Advertisement -

ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజుల 
ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం 
నవతెలంగాణ-పాలకుర్తి

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తుందని ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల అన్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ల ఆదేశాల మేరకు మండలంలోని  పెద్దతండ (బి), రాఘవాపురం, మంచుప్పుల, బిఖ్య నాయక్ పెద్ద తండా (ఎం), పెద్ద తండా (కె) గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావులతో కలిసి మంజుల మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు.

 ‌ ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17% తేమ ఉన్న ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. తాలు లేకుండా చూసుకోవాలన్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ ప్రకటిస్తూ రైతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం తడవకుండా పరదాలు అందుబాటులో ఉండే విధంగా అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం గ పనిచేస్తుందని తెలిపారు.

రైతులను రాజును చేయాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడిన, ధాన్యం కోతలు విధించి రైతులను నష్టం కలిగే విధంగా పాల్పడితే చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. కాంటాలైన 72 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతారావు, జిల్లాకు ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు బండిపెళ్లి మనమ్మ, లావుడియా భాస్కర్ నాయక్, నాయకులు నునావత్ హరిలాల్, మొలుగూరి యాకయ్య గౌడ్, ఎండి సలీం, లాకావత్ రవి, జోగు పరశురాములు, లతోపాటు ఐకెపి సీసీ కారుపోతుల వెంకటేశ్వర్లు, ఏఈఓ, జిపిఏలు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -