Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుపత్తి పంటకు మద్దతు ధర పెంపు 

పత్తి పంటకు మద్దతు ధర పెంపు 

- Advertisement -

కపాస్ కిసాన్ యాప్ ద్వారా పారదర్శక కొనుగోలు

వ్యవసాయ అధికారి శ్రీనివాస్

నవతెలంగాణ – ఆలేరు రూరల్

పత్తి పంటకు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచింది.గత సంవత్సరం  కిలోకు ₹7,521గా ఉన్న మద్దతు ధరను ఈ సంవత్సరం ₹8,110గా ప్రభుత్వం నిర్ణయించింది అని ఆలేరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.గత ఏడాదితో పోలిస్తే ₹589 రూపాయలు పెరిగింది.పత్తి కొనుగోళ్లలో దళారీల అవకతవకలు అరికట్టే ఉద్దేశంతో “కపాస్ కిసాన్” యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అన్నారు.ఈ యాప్‌లో రైతులు తమ ఆధార్‌కి లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ద్వారా ఓటీపీ తీసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.స్లాట్‌ బుక్‌ చేసిన రైతుల పత్తినే కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు స్వీకరిస్తాయి అని చెప్పారు.తద్వారా రైతులకు సరైన ధర లభించడమే కాకుండా దళారీల దోపిడీ తగ్గే అవకాశం ఉందన్నారు ఇప్పటికే ఆలేరు మండలంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు కార్యకలాపాలు ప్రారంభించాయి.గత వారం రోజులుగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి అన్నారు..రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పత్తిని మద్దతు ధరకే అమ్ముకోవాలన్నారు.ప్రైవేట్‌ వ్యక్తులకు తక్కువ ధరలకు విక్రయించవద్దని అధికారులు సూచిస్తున్నారు.కపాస్ కిసాన్ యాప్‌ వినియోగంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే,ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌‌ను సంప్రదించాలని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -