నవతెలంగాణ-హైదరాబాద్
హబ్సిగూడకు చెందిన సుప్రభాత్ హౌటల్‌కు నగరంలో ఉత్తమ హౌటల్‌గా అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా హౌటల్ ఎండీ ఎం. కృష్ణమూర్తి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఫిలిం కార్పొరేషన్ చైర్మెన్ దిల్‌రాజు, డీజీపీ జితేందర్, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కృష్ణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు.నగరంలో నాలుగు దశాబ్దాలుగా తాను హౌటల్ రంగంలో అందిస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని అన్నారు. కేవలం వ్యాపారవేత్తగా కాకుండా వినియోగదారులకు నాణ్యమైన, రుచి కరమైన ఆహారం అందిస్తూ వారి మన్ననలు పొందుతున్నానని పేర్కొన్నారు. అంతేకాక ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. తన సేవలను గుర్తించి కర్నాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించిందని గుర్తుచేశారు.
సుప్రభాత్ హౌటల్‌కు టూరిజం అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES