No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంసుప్రీం అక్షింతలు

సుప్రీం అక్షింతలు

- Advertisement -

బీహార్‌లో తొలగించిన
ఓటర్ల జాబితా విడుదల
కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్‌
న్యూఢిల్లీ :
బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ద్వారా తొలగించిన అరవై ఐదు లక్షల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ జాబితాను ప్రజల పరిశీలన నిమిత్తం కమిషన్‌ అధికారిక వెబ్‌సైటులో ఉంచారు. ఈ నెల 14న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ జాబితాను ప్రచురించింది. ప్రత్యేక సవరణ అనంతరం ఎన్నికల సంఘం తొలగించిన ఓటర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేవా అనే విషయాన్ని సులభంగా పరిశీలించుకునేందుకు వీలుగా బీహార్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైటులో కొత్త లింకును యాక్టివేట్‌ చేశారు.తొలగించిన ఓటర్ల పేర్లను, తొలగించడానికి కారణాలను…అంటే వారు చనిపోయారా లేక వలసపోయారా లేక రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారా…జిల్లాల వారీగా ప్రచురించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. పోలింగ్‌ కేంద్రాల వారీగా తొలగించిన ఓటర్ల జాబితాలను జిల్లా ఎన్నికల అధికారి కార్యాల యంలో ప్రదర్శించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. జిల్లాల ఎన్నికల అధికారులు ఆ జాబితాలను తమ సామాజిక మాధ్యమ వెబ్‌సై ట్లలో ఉంచాలని సూచించింది. సమాచారాన్ని అన్ని వార్తా పత్రికలు, రేడియో, టీవీ తదితర మాధ్యమాల ద్వారా తెలియజేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. తొలగించిన ఓటర్ల జాబితాను ప్రతి బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) వద్ద, పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలని తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad