న్యూఢిల్లీ : దీపావళి నేపథ్యంలో ఢిల్లీ, దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో బాణాసంచాకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఇఇఆర్‌ఐ), పెట్రోలియం-పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పిఇఎస్‌ఇ)లు ఆమోదించిన గ్రీన్ కాకర్స్ అమ్మకాలు, వినియోగానికి ఈ నెల 18 నుంచి 20 వరకూ సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఈ నెల 19, 20 తేదీల్లో బాణాసంచా వినియోగాన్ని ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ, రాత్రి సమయంలో 8 నుంచి 10 గంటల వరకూ మాత్రమే సిజెఐ బిఆర్ గవాయ్, జసిస్ట్ కె. వినోద్ చంద్రన్ ధర్మాసనం పరిమితం చేసింది.
అలాగే, షరతులతో ఇచ్చిన ఈ అనుమతి వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలతో భాగస్వామ్యం కాగలదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఒక పరీక్షా సమయంగా ధర్మాసనం వర్ణించింది. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 25 వరకూ ప్రతీరోజూ వాయు నాణ్యతా సూచిక(ఎక్యూఐ) వివరాలతో నివేదికను సమర్పించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సిపిసిబి), సంబంధిత రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ఐదు నెలల క్రితం ఢిల్లీలో యావత్తూ బాణాసంచాను నిషేధాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఢిల్లీలో బాణాసంచాకు సుప్రీంకోర్టు అనుమతి
- Advertisement -
- Advertisement -