Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయంపోక్సో చట్ట దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన

పోక్సో చట్ట దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన

- Advertisement -

ప్రజల్లో చైతన్యం అవసరమని వ్యాఖ్య
న్యూఢిల్లీ :
పోక్సో చట్టం దుర్వినియోగమవు తుండడంపై సుప్రీం కోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక విభేదాలు, సహజీవనం కేసుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని మౌఖికంగా వ్యాఖ్యా నించింది. ఈ చట్ట నిబంధనల గురించి పురుషుల్లో, మగపిల్లల్లో చైతన్యం పెంపొం దించాల్సిన అవ సరం వుందని నొక్కి చెప్పింది. బాలికలకు, యువతులకు దేశం మరింత సురక్షితమైనదిగా ఉండాలంటే లైంగికదాడికి పాల్పడితే ఎదుర్కొనాల్సిన నిబంధనలు, చర్యలు గురించి, అలాగే పోక్సో చట్టం గురించి ప్రజలకు తెలియచేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతున్న పిల్‌ (ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం)ను జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది. ఈ విషయంలో తమ స్పందన తెలియచేస్తూ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అఫిడవిట్‌ దాఖలు చేయనందున పిల్‌పై విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.

సీనియర్‌ న్యాయవాది హర్షద్‌ పొండా చేసిన ఈ అభ్యర్ధనపై స్పందన తెలియచేయాలంటూ అంతకుముందు కోర్టు, కేంద్రానికి, విద్యా శాఖ, సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)కి నోటీసులు జారీ చేసింది. లైంగికదాడి చట్టాల గురించి, నిర్భయ కేసు తర్వాత అటువంటి చట్టాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పొండా పేర్కొన్నారు. లింగ సమానత్వం, స్వేచ్ఛగా జీవించేందుకు యువతులకు గల హక్కులు గురించి కూడా తెలియచెప్పాలని, వాటిని నైతిక శిక్షణాంశాలుగా చేయాలని పిల్‌ సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -