Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంబాను ముస్తాక్‌ ఆహ్వానంపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

బాను ముస్తాక్‌ ఆహ్వానంపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బుకర్‌ బహుమతి విజేత బాను ముస్తాక్‌ను కర్ణాటక ప్రభుత్వం మైసూరు దసరా ఉత్సవాలకు ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సమానత్వం, సోదరభావం, మరియు లౌకిక వాదం ఆదర్శభావాలు కలిగిన రాజ్యాంగ ప్రవేశికను చదవలేదా అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పిటిషనర్‌ హెచ్‌.ఎస్‌.గౌరవ్‌ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తోందని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేర్కొన్నారు. ముస్తాక్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ గౌరవ్‌ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక ప్రభుత్వం కొట్టివేసిన సంగతి తెలిసిందే.

బాను ముస్తాక్‌ సెప్టెంబర్‌ 22న మైసూరులో దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారని కర్ణాటక ప్రభుత్వం ఆగస్ట్‌ 22న ప్రకటించింది. ముస్తాక్‌ రైతుల పోరాటాల్లో, పలు ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నారని, కన్నడ భాష కోసం పోరాడారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. న్యాయవాది, రచయిత్రి అయిన బానుముస్తాక్‌ అనువాద చిన్నకథల సంకలనం హార్ట్‌ లాంప్‌కు బుకర్‌ బహుమతిని గెలుచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -