Monday, January 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో.. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై సమాధానం చెప్పాలని స్పీకర్‌కు నోటీసులు ఇచ్చింది.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్‌ అమలు చేయలేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ వేశారు. దాంతో సమాధానం చెప్పాలంటూ స్పీకర్‌కు సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్‌ పిటిషన్‌లతో జతచేసింది. అన్ని పిటిషన్‌లపై కలిపి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -