- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో పాటు రాజస్థాన్ ప్రభుత్వం, NHAI, కేంద్ర రవాణాశాఖకు కూడా నోటీసులు అందాయి. రెండు వారాల్లోగా రోడ్డు ప్రమాదాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, జాతీయ రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- Advertisement -



