నవతెలంగాణ న్యూఢిల్లీ : కేరళ సిఎం పినరయి విజయన్ కార్యదర్శి కె.ఎం అబ్రహం అక్రమాస్తుల ఆరోపణలపై సిబిఐ విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అబ్రహం కేరళ మౌలిక సదుపాయాల మూలధన నిధి బోర్డు (కెఐఐఎఫ్‌బి) సిఇఒగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అబ్రహం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్‌మోహన్‌లతో కూడిన ధర్మాసనం స్టే విధిస్తూ సిబిఐకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లో కేరళ హైకోర్టు ఈ కేసులో అబ్రహంపై విచారణ చేపట్టాలని సిబిఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.
- Advertisement -