Friday, May 23, 2025
Homeజాతీయంప్రసూతి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రసూతి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

- Advertisement -


నవతెలంగాణ న్యూఢిల్లీ:
మహిళలకు ప్రసూతి సెలవులను సుప్రీం కోర్టు మరోసారి సమర్థించింది. వారు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవిగా పేర్కొంది. ఏ సంస్థ స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినికి రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను విద్యాశాఖ నిరాకరించింది. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన మొదటి వివాహం నుంచి ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. తాజాగా మరోసారి ప్రసూతి సెలవులకు నిరాకరించినట్టు ఆమె వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర నిబంధనల ప్రకారం తొలి ఇద్దరు పిల్లలకు మహిళలు ప్రసూతి లబ్ధిని పొందే అవకాశం ఉంది.

తాను రెండో వివాహం చేసుకొన్న అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లు ఆ ఉపాధ్యాయిని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు.. తన రెండు కాన్పులకు ఎటువంటి ప్రసూతి సెలవులు వాడుకోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కేవీ ముత్తుకుమార్‌ స్పందిస్తూ.. ఆమె ప్రాథమిక హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -