Sunday, May 18, 2025
Homeఎడిట్ పేజిసుప్రీంకోర్టు తీర్పుకే చక్రం అడ్డు?

సుప్రీంకోర్టు తీర్పుకే చక్రం అడ్డు?

- Advertisement -

రాజ్యాంగపరమైన అనిశ్చిత పరిస్థి తికి కారణమవుతున్న ఒక సుదీర్ఘ సమస్యపై అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన నిర్దేశం చేస్తే దాని అమలుకు చర్యలు తీసుకోవడం జరగాలి. నరేంద్రమోడీ ప్రభుత్వం అం దుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గవర్నర్ల పాత్రపై సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు బదులు అలా తీర్పునిచ్చే అధికారం ఉందా, లేదా? తేల్చమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా శరవేగంగా పద్నాలుగు ప్రశ్నలు సంధింపజేసింది. పేరుకు రాష్ట్రపతి రాసిందైనా ఈ వ్యవ హారం మొత్తం కేంద్రం కనుసన్నల్లోనే జరిగింది. రాజ్యాంగ పరంగా కూడా భారత రాష్ట్రపతి అలంకారప్రాయమైన అధినేత మాత్రమే. ఏప్రిల్‌ 8వ తేదీన గవర్నర్ల విషయమై సుప్రీం కోర్టు తీర్పురాగా ఆ మరుసటి రోజునే కేంద్రం దానికి ఎలా విరుగుడు చేయాలని మంతనాలు ప్రారం భించింది. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఇంకా న్యాయశాఖ ప్రతినిధుల తో విస్తారంగా చర్చలు సాగించింది. చివరకు మే ఏడవ తేదీ నాటికి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు సమర్పించే ప్రశ్నావళి ప్రస్తావనను ఖరారు చేసింది. మొదట ఈ తీర్పుపై సమీక్ష కోరాలా లేక మరింత విస్తత ధర్మాసనం కోరాలా అని తర్జనభర్జనలు జరిపింది. రాజ్యాంగం 143(1) అధికరణం కింద రాష్ట్రపతి పేరిట సలహా కోరడమే ఉపయోగకరమని నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి కోరిన అంశాన్ని పరిశీలించడానికి ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయటం పరిపాటి. అయితే అసలు ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలా వద్దా అని కూడా సుప్రీంకోర్టు తన నిర్ణయానికి తాను రావచ్చు. ఉదాహరణకు బాబ్రీ మసీదు/రామ జన్మభూమి వివా దంలో విధ్వంసం తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరింది. అయితే ఈ విషయంలో తాము అభిప్రాయం చెప్పగలిగేది లేదని, రాజకీయ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధారించింది.
గత ఉదాహరణలు
1960లో సి జాబితాలోని రాష్ట్రాల ప్రతిపత్తిపై సూచనలు కోరింది కేంద్రం.పాకిస్తాన్‌తో ప్రాదేశిక భూభాగంపై ఒప్పందం చేసుకోవచ్చునన్న విషయం 1951లో సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది.1978లో ఎమర్జెన్సీ తర్వాత ఆ అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయవచ్చునా? అన్న అంశంపై అభిప్రాయం కోరింది, వీటిపై చెప్పడం లేదా ఒకటి రెండుసార్లు నిరాకరించటం జరిగింది. రాజ్యాం గం 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు మాత్రమే అందులోని నిబంధనలకు అమలుకు చెల్లుబాటుపై తుది మాట చెప్పవలసి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక స్వభావమన్న తీర్పు తర్వాత ఇది మరింత బలపడింది. అదే సమయంలో 143(1) అధికరణం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరే అధికారం ఇస్తుంది. కాకపోతే ప్రస్తుతం ద్రౌపది ముర్ము పంపిన ప్రస్తావన కేవలం రాజ్యాంగ నిబంధనల అనువర్తింపునకే కాక, రాజకీయ సంఘర్షణ, రాజ్యాంగ ప్రతిష్టంభనకూ దారితీసే ప్రమాదం ఉన్నది.
తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆరాష్ట్ర శాసన సభ ఆమోదించిన పది బిల్లులను అంతులేని జాప్యంతో అట్టి పెట్టుకోవడం సుప్రీంకోర్టు విచారిం చింది. తమ ముందుకు వచ్చిన బిల్లులపై మూడు మాసాల్లోగా ఆమోదం లేదా నిరాకరణ చేయవలసి ఉంటుందని తేల్చిచెప్పింది. ఒకవేళ రాష్ట్రపతి పరిశీలనకు పంపేట్లయితే అప్పుడు కూడా మూడుమాసాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. దాంతో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలి స్తుందని దీనిపై చాలామంది అభ్యంతరాలు లేవనెత్తారు. ఇప్పుడు రాష్ట్రపతి పంపిన 143(1) ప్రస్తావన కూడా అలాంటి ప్రశ్నలే ముందుకు తెచ్చింది. రాజ్యాంగం 200, అధికరణం గవర్నర్‌ పరిధిని చెపుతుంది. 21వ అధికరణం శాసనసభ ఆమో దించిన బిల్లుల అంగీకారం ముద్ర గురించి వివరిస్తుంది. ఇందుకు సంబంధించి మరి ఏ విధ మైన నిర్దేశాలు లేనప్పుడు మూడు మాసాల్లోనే పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఎలా చెప్తుందనేది ప్రశ్నల సారాంశం.
పెత్తనానికి పగ్గాలు
వాస్తవానికి చాలామంది వాదిస్తు న్నట్టు ఇక్కడ సుప్రీంకోర్టు, రాష్ట్రపతి లేదా గవర్నర్‌లను ఏం చేయాలో, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆదేశించలేదు. తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవడానికి మూడు మాసాల వ్యవధి ఉండాలని మాత్రమే చెబుతున్నది. ఈ విధంగా చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని నొక్కి వక్కాణించేదే కానీ అందుకు భిన్న ంగా చెప్పిందికాదు. ఈ గడువు కూడా గతంలో ఇందిరాగాంధీ హయాంలో సర్కారియా కమిషన్‌, వాజ్‌పేయి హ యాంలో పూంఛ్‌ కమిషన్‌లకు ఆధ్వర్యంలో వహించిన మాజీ న్యాయ మూర్తులు చెప్పిందే. ఇంతకంటే సూటిగా గతంలో రెండు మూడు సందర్భాల్లో ఉన్న అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రపతి విధి విధానాలపై నిర్దేశాలిచ్చాయి.1994లో ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, రాష్ట్రపతి పాలన విధింపునకు సంబం ధించి అప్పటివరకు జరిగిన ఏకపక్ష పోకడ లకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. మరణ శిక్ష పడ్డ ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడానికి కూడా నిర్ణీత గడు వును సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆతీర్పు తర్వాత అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శరవేగంగా నిర్ణయాలు తీసుకోవటం మనం చూశాం. అప్పుడెప్పుడూ లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చినట్టు?
ఈ ప్రస్తావన పంపడానికి ముందే ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్కర్‌ సుప్రీం కోర్టుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పతిని తక్కువ చేయటంలా చిత్రించారు. ఆయన మాటలు కేంద్రం వైఖరికి ప్రతిధ్వను లేనని ఇప్పుడు స్పష్టమవుతున్నది. మోడీ హయాంలో అనేక రాష్ట్రాల్లో నియమితులైన గవర్నర్లు అత్యుత్సాహంతో ప్రత్యక్ష రాజ కీయ పాత్ర పోషిస్తూ, అపర సైంధవుల్లా బీజేపీయేతర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేరళలో అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, తమిళనాడులో ఆర్‌ఎన్‌ రవి, తెలంగాణలో లోగడ తమిళిసై, బెంగాల్‌లో ఇదే జగదీప్‌ దన్కర్‌, త్రిపురలో తథాగత రాయి వంటి గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా వ్యవ హరించారు. అన్నిచోట్ల లెక్కలేనన్ని బిల్లులు కదలిక లేకుండా పడి ఉన్నాయి. కాంగ్రెస్‌ హయాంలోనూ గవర్నర్ల దుర్వినియోగం, ప్రభుత్వాల రద్దు జరిగినప్పటికీ మోడీ పాలనలో ఒక విధంగా అది పరాకాష్టకు చేరింది. ఎడతెగని ఈ సంఘర్షణకు సుప్రీంకోర్టు నిర్దేశం స్వస్తి పలుకుతుందని అందరూ ఆశించారు. కానీ రాష్ట్రపతి పదవిని ఉపయోగిం చుకుని కేంద్రం అందుకు చక్రం అడ్డువేస్తున్నది. ఈ విధంగా తన నిరంకుశ ఏకపక్ష పెద్దనాన్ని సాగించు కోవడమే బీజేపీ ఉద్దేశంగా స్పష్టమవుతున్నది. సమాఖ్య తత్వం భారత రాజ్యాంగం మౌలిక లక్షణాల్లో ఒకటైనప్పుడు ప్రజలెనుకున్న ప్రభుత్వాలను, శాసనసభల నిర్ణయాలను గౌరవించటం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం. అందుకు పూర్తి భిన్నంగా కేంద్రీకత పద్ధతిలో ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే మోడీ, ఒకే మతం అన్న తరహాలో నడుస్తున్న విపరీత పరిస్థితికి ఇది తాజా ఉదాహరణ. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగపరమైన అత్యున్నత పదవిగా వారు చెబుతున్న రాష్ట్రపతి స్థానాన్ని ఉపయోగిం చుకుని రాజ్యాంగంపైన దాడిచేయడం మోడీ వ్యూహం. ఇప్పుడు దీనివల్ల అమలు ఆగిపోతుందనే సందేహం చాలా మందిలో ఉంది. కేంద్రం కోరుకునేది కూడా అదే. అనా లోచితంగా దీన్ని సుప్రీంకోర్టు హద్దు మీరినట్టుగా చిత్రిం చడం వాస్తవాలను తలకిందులు చేయటమే.అనేక అధ్యయ నాలు నివేదికలు, నిబంధనలు ఉటంకిస్తూనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆతీర్పులోనే దాని అభిప్రాయం వుంది.
సంధి దశలో కీలకకేసులు
ఈ విషయంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందని అంశం అట్టిపెట్టి ప్రస్తుత సందర్భాన్ని తీసుకుంటే మరింత తీవ్రమైన రాజకీయ సంకేతాలు గోచరిస్తాయి. మే 14వ తేదీన నూతన ప్రధాన న్యాయమూరి (సిజెఐ) గా జస్టిస్‌ బిఆర్‌ గవారు ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్‌ 23వ తేదీ వరకు ఆరు నెలలు పాటు మాత్రమే ఆయన పదవిలో ఉంటారు. గతంలో ఆయన న్యూస్‌క్లిక్‌ కేసులను, ఢిల్లీ మాజీమంత్రి సిసోడియా, తీస్తా సెతల్వాద్‌ వంటి కేసుల్లో ప్రాథమిక హక్కులకు అనుకూలమైన తీర్పునిచ్చారు. ఎన్నికల బాండ్ల రద్దు తీర్పులో భాగస్వామిగా వ్యవహ రించారు. రాహుల్‌గాంధీకి పరువు నష్టం కేసులో ఉపశమనమిచ్చారు. తన కుటుంబ నేపథ్యాన్ని బట్టి రాహుల్‌ కేసు విచారణ నుంచి తప్పుకుంటానంటే కేంద్రం అడిగిన మేరకు కొనసాగారు. మొత్తంపై సిజెఐ గవారు సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కులకు అనుకూలంగా అనేక తీర్పులివ్వడం, ఆ ధర్మాసనాల్లో ఉండటం సంభవించింది. వ్యక్తిగతంగా ఆయన రిపబ్లిక్‌న్‌ పార్టీ వ్యవస్థాపకుడైన ఆర్కే గవారు కుమారుడు. యూపిఏ హయాంలో ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్‌గా అనేక బాధ్యతలు నిర్వహించిన ఆర్కే గవాయి దళిత ఉద్యమంలో ముఖ్యపాత్రధారి. తను దేశానికి మొదటి బౌద్ధ నేపథ్యంగల న్యాయమూర్తిని సిజెఐ గవాయి ప్రకటించారు. దళితుడిగా ఈ పదవిలోకి వచ్చిన రెండవ వ్యక్తి ఆయన. భారతదేశం బహుళ మతాలు, సంస్క తులు, రాజకీయాలు, ప్రాంతాలు వంటి వైవిధ్యా లతో కూడిన దేశ మని, ఇది న్యాయవ్యవస్థలో ప్రతిబిం బించాలని నియామకం తర్వాత తొలుతనేే ప్రకటించారు. సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంటు కాకూడదని ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలను పదవి స్వీకారానికి ముందే తోసి పుచ్చారు. రాజ్యాంగమే అందరికీ సర్వోన్నత మైనదని నొక్కి చెప్పారు. అంబేద్కర్‌వాదంతో ఆరంభం నుంచి కొనసాగుతున్న గవారు, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే మోడీ ప్రధానమంత్రి కాగలిగారని, తాను ప్రధాన న్యాయమూర్తి నయ్యానని చెప్పారు.
ఇప్పుడు ఆయన ముందు కొత్త వక్ఫ్‌Ûచట్టం, ప్రార్థనా స్థలాల చట్టం కేసు, ఇంకా అనేకం ఉన్నాయి. ఇవి దేశ రాజకీయాలనే కాక సామా జిక మత సంబంధాలను కూడా నిర్దేశించగలవే. వాస్తవానికి వక్ఫ్‌చట్టంపై కేసు దిగిపోయిన సీఐ సంజీవ్‌ కన్నా ముందుండింది. ప్రాథమికంగా దానికి అభ్యంతరాలు చెప్పి కేంద్రం చర్యలు తీసుకోకుండా నిలవరించిన జస్టిస్‌ ఖన్నా తన పదవీకాలం ముగుస్తుంది కనుక ఈ కేసు విచారణ రాబోయే వారికి అప్పగిస్తానని ప్రకటిం చారు. మరి ఆరుమాసాల వ్యవధిలో సిజెఐ దాని పూర్తి చేయగలరేమో చూడాలి. కీలకమైన ఇన్ని కేసులు చూడాల్సిన తరుణంలో రాష్ట్రపతి ప్రస్తావన రూపంలో కేం ద్రం తన ప్రతికూలతను ప్రకటించడం ముందరికాళ్లకు బంధం వేస్తుందా? అనే ప్రశ్న తప్పక వస్తుంది. రాజ్యాం గంపై దాడి అన్నది మోడీ ప్రభుత్వానికి పరిపాటేకానీ ఇప్పు డు ఈ విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఆక్షేపించటంఅంటే రాష్ట్రాల హక్కులను అను మతిం చడానికి కేంద్రం సిద్ధంగా లేదన్నమాట. రాష్ట్రపతి ప్రశ్నల పేరుతో, సవాళ్ల పేరుతో రాష్ట్రాల హక్కులను గవర్నర్ల చేతిలో పెట్టడం మాత్రం సరైనది కాదు. ఇన్ని అంశాలపైన భవిష్యత్తు సవాళ్లపైన సిజెఐ గవారు ఎలా స్పందిస్తారో, న్యాయవ్యవస్థ గమనం ఎలా ఉంటుందో చూద్దాం.
తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -