Thursday, May 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రం గర్వించదగిన గొప్ప వ్యక్తి సురవరం: హరీష్ రావు

రాష్ట్రం గర్వించదగిన గొప్ప వ్యక్తి సురవరం: హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన వ్యక్తి సురవరం ప్రతాప రెడ్డి అని హరీశ్ రావు అన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. సోషల్ మీడియాలో ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ వేదికగా ట్విట్ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా అని అన్నారు. తెలంగాణపై వివక్షను ఆనాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. రాష్ట్రం గర్వించదగిన గొప్ప వ్యక్తి, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సురవరం స్పూర్తి ఇమిడి ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -