సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి యేటా వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 48 మంది ప్రముఖులను కీర్తి పురస్కారాలతో సత్కరిస్తున్నది. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది.
పురస్కారాలకు ఎంపికైనవారు:
కేతరాజు వరలక్ష్మి, కేతరాజు కామేశ్వరరావు (ఆధ్యాత్మిక సాహిత్యం), ఎం.వి.లోకనాథం (ప్రాచీన సాహిత్యం), ఉదారి నారాయణ (సృజనాత్మక సాహిత్యం), వరిగొండ కాంతారావు (కాల్పనిక సాహిత్యం), మరింగంటి లక్ష్మణాచార్యులు (అనువాద సాహిత్యం), రమేష్ నారాయణ (అనువాదం), డా. అమరవాది నీరజ (బాలసాహిత్యం), కె. వీణారెడ్డి (ఉత్తమ రచయిత్రి), డా.కె.లావణ్య (ఉత్తమ రచయిత్రి), బైరెడ్డి కృష్ణారెడ్డి (వచన కవిత), కోటం చంద్రశేఖర్ (వచన కవిత), పాలపర్తి హవీల (పద్యరచన), కర్నాటి రఘురాములు గౌడ్ (పద్యరచన), వేంపల్లె షరీఫ్ (కథ), చింతకింది నివాస్ (నవల), తోలేటి అరుణ (హాస్య రచన), డా.యం. దేవేంద్ర (వివిధ ప్రక్రియలు), జలదంకి సుధాకర్ (ఉత్తమ నాటక రచయిత), మేకా రామకృష్ణ (ఉత్తమ నటుడు), డా. బిహెచ్.పద్మప్రియ (ఉత్తమ నటి), డా.వెంకట్ గోవాడ (నాటకరంగంలో కృషి), చాగంటి కృష్ణకుమారి (జనరంజక విజ్ఞానం), తుమ్మల దేవ్ రావు (పరిశోధన), ఆలేటి మోహన్ రెడ్డి (భాషాఛందస్సు), డా.ఎస్.రఘు (సాహిత్య విమర్శ), ఆవుసుల భానుప్రకాష్ (అవధానం), డా. సత్యలక్ష్మి (మహిళాభ్యుదయం), పద్మ మధునాపంతుల (లలిత సంగీతం), బి.వి.దుర్గా భవాని (శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), గిద్దె రామనర్సయ్య (జానపద గాయకులు), ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి (జానపద కళలు), కంపల్లె రవిచంద్రన్ (జీవిత చరిత్ర), గోవిందరాజు చక్రధర్ (పత్రికా రచన), ఉమామహేశ్వర పాత్రుడు (ఆంధ్రనాట్యం), ఆర్.రత్న (కూచిపూడి నృత్యం), జి.శోభనాద్రి (వ్యక్తిత్వ వికాసం), బి.సాంబశివరావు (హేతువాద ప్రచారంలో కృషి), డా. యాదగిరి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), సుభాషిణి (గ్రంథాలయకర్త), కమలాకర భారతీ దేవి (సాంస్కృతిక సంస్థా నిర్వహణ), రమ్య (ఇంద్రజాలం), నెల్లుట్ల వెంకట రమణ (కార్టూనిస్ట్), డా.పి.కల్పవల్లి (జ్యోతిషం), వురిమళ్ళ సునంద (ఉత్తమ ఉపాధ్యాయులు), డా.కె. శ్రీనివాసాచారి , కుంట సదయ్య (జానపద కళలు), డా.గడ్డం శ్యామల (గజల్)లకు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో నందమూరి తారక రామారావు కళామందిరంలో ఈనెల 23,24 తేదీల్లో జరిగే ప్రతేక్య ఉత్సవంలో ఒక్కొక్కరికి రూ.5,116/- నగదుతో సత్కరిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు.