Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సురేందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

ఘనంగా సురేందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

- Advertisement -

– నివాళులర్పించిన నాయకులు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని రాజరాజేశ్వరి నగర్, కోనాపూర్ గ్రామాల్లో బుధవారం రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 9వ వర్ధంతి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న సురేందర్ రెడ్డి విగ్రహానికి  పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ… రైతుల అభ్యున్నతి కోసం సురేందర్ రెడ్డి చేసిన సేవలు మరవలేని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో పాటు పడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిప్పెర అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు అవారి మురళి,నాయకులు సదాశివ గౌడ్, అవారి గంగారెడ్డి, కోనాపూర్ లో సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ దయ్య దేవయ్య,  మాజీ ఎంపీటీసీ సభ్యుడు లకావత్ గంగాధర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad