Saturday, May 3, 2025
Homeజాతీయంసురేష్‌ ప్రొడక్షన్స్‌కుసుప్రీంలో లభించని ఊరట

సురేష్‌ ప్రొడక్షన్స్‌కుసుప్రీంలో లభించని ఊరట

– నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సురేష్‌ ప్రొడక్షన్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్‌ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గతంలో వైసీపీ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సురేష్‌ ప్రొడక్షన్‌ సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే పిటిషన్‌ విషయం లో జోక్యం చేసుకునేందుకు ధర్మా సనం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్‌ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని జస్టిస్‌ అభరు ఓకా సూచించారు. పిటిషన్‌ను ఉపసంహరించు కుంటామని సురేష్‌ ప్రొడక్షన్స్‌ తెలుపగా.. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. కాగా.. విశాఖలో సురేష్‌ ప్రొడక్షన్స్‌కు ఫిల్మ్‌ సిటీ కోసం కేటాయించి భూములను ఇతర అవసరాలకు వాడేందుకు గత వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగు తోందని గుర్తించింది. దీంతో సురేష్‌ ప్రొడక్షన్స్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సురేష్‌ ప్రొడక్షన్స్‌కు కూటమి సర్కార్‌ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులపై సుప్రీంను సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఆశ్రయించింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. షోకాజ్‌ నోటీసులపై మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తన పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటు న్నట్టు సుప్రీంకోర్టుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img