Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండోసారి మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌గా సూర్నపు సోమయ్య

రెండోసారి మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌గా సూర్నపు సోమయ్య

- Advertisement -

మహబూబాబాద్‌ సీపీఐ(ఎం) శ్రేణుల్లో విజయోత్సాహం
కౌన్సిలర్లుగా ముగ్గురు ప్రమాణస్వీకారం

నవతెలంగాణ-మహబూబాబాద్‌
సీపీఐ(ఎం) మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్నపు సోమయ్య రెండోసారి మహబూబాబాద్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఆర్డీవో కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన చైర్మెన్‌, వైస్‌చైర్మెన్‌ ఎన్నికలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) పొత్తుతో వైస్‌ చైర్మెన్‌గా సూర్నపు సోమయ్య ఎన్నికయ్యారు. సోమయ్య మహబూబాబాద్‌ మండల పరిషత్‌లో రెండుసార్లు ఎంపీటీసీగా, మహబూబాబాద్‌ గ్రామపంచాయతీలో ఒకసారి వార్డు సభ్యులుగా గెలిచి ఉపసర్పంచ్‌గా పని చేశారు.

మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో 2014 నుంచి 19 వరకు కౌన్సిలర్‌గా పని చేస్తూ వైస్‌చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2020లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. అలాగే 2026లో సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ మద్దతుతో రెండోసారి వైస్‌చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌పొత్తుతో సీపీఐ(ఎం) నాలుగు వార్డుల్లో పోటీ చేయగా మరొక వార్డులో స్వతంత్రంగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు ముగ్గురు గెలుపొందారు. 15వ వార్డు నుంచి బానోత్‌ బాబు, 16వ వార్డు నుంచి బానోతు పద్మ సీతారాంనాయక్‌, 29వ వార్డు నుంచి సూర్నపు సోమయ్య గెలుపు పొందారు. గెలుపొందిన ముగ్గురు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -