మహా శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా శివ కీర్తనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక మహా దేవుడిపై తాజాగా రాశీ ఖన్నా పాడిన పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. తాను పాడిన పాటకు వస్తున్న ప్రశంసలపై రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘శివ్ కైలాషోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం, అంత రంగాన్ని మేల్కొల్పడం, అతీంద్రియత శక్తి అయిన మహా దేవుడి మీద భక్తిని చాటే ప్రార్థనగా నిలుస్తుంది.
‘మహా శివరాత్రి’ అత్యంత పవిత్రమైన పర్వదినం కావడం, ఇలాంటి ఓ విశిష్టమైన రోజున పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆమె తెలిపారు. ఈ పాటలో రాశీ కనిపించిన తీరు, ఆమె వినయం, పలికించిన భావోద్వేగాలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆమె స్వరం సైతం ఎంతో వినసొంపుగా, వినడానికి మనసుకు ఎంతో హాయిగా అనిపించేలా ఉంది. ఆమె పాడుతున్న విధానంలో ఒక నిశ్శబ్ద ప్రకాశం, ప్రశాంతత ఉంది. ఇదొక భక్తిపూర్వకమైన నిజాయితీ ప్రదర్శనలా కాకుండా ప్రార్థనలా అనిపిస్తుంది.
అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



