Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్518 సర్వే నెంబర్ ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

518 సర్వే నెంబర్ ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ పరిధిలో గల 518 సర్వే నెంబర్ను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు కలిశారు. 518 సర్వే నెంబర్ను భూ సమస్య, 22ఏ ఇండ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎంతో చర్చించి  సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బబ్బురి పోశెట్టి గౌడ్, కోట మహేందర్, శెట్టి యాదగిరి యాదవ్, శెట్టి సుమన్ యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, బబ్బురి నందు, మాటూరి రవి, బాబుూరి సురేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -