- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఇద్దరి అంశం సుప్రీంకోర్టులో ఉండటంతో, ఆ కేసు తేలితేనే వారి పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. గతంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో నామినేట్ చేయగా, సుప్రీంకోర్టు వారి పదవులను రద్దు చేసింది. ఆగష్టు 30న కోదండరాం, అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను నామినేట్ చేసినా, కోర్టు కేసుతో ప్రమాణ స్వీకారం పెండింగ్‌లో పడింది. దీంతో గవర్నర్ కోటా పదవుల భర్తీపై ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -



