– తక్షణమే రీసెర్చ్ స్కాలర్‌గా తిరిగి పరిగణించాలి
– టీఐఎస్‌ఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
– తీర్పును స్వాగతించిన ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దళిత రీసెర్చ్ స్కాలర్ రామదాస్ ప్రిని శివానందన్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, ఆయన ను తక్షణమే స్కాలర్‌గా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శుక్రవారం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్)ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తన రెండేం డ్ల సస్పెన్షన్‌ను, దేశవ్యాప్తంగా ఉన్న టీఐఎస్‌ఎస్ క్యాంపస్‌ల్లోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ రామదాస్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలోని వయనాడ్‌కు చెందిన రామదాస్ టీఐఎస్‌ఎస్ ముంబయిలో డెవలప్ మెంట్ స్టడీస్‌లో పరిశోధనా స్కాలర్‌గా ఉన్నారు.
2024 ఏప్రిల్‌లో విద్యార్థి సమస్యలపై గొంతెత్తినందుకు రామదాస్‌ను టీఐఎస్‌ఎస్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఎంపవర్డ్ కమిటీ కనుగొన్న విషయాలను ఉటంకిస్తూ, టీఐఎస్‌ఎస్ ముంబయి, తుల్జాపూర్, గౌహతి, హైదరాబాద్ లోని దాని నాలుగు క్యాంపస్‌ల నుంచి కూడా రామదాస్‌ను నిషేధించింది. ఈ చర్య ఏకపక్షమని, తన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని రామదాస్ వాదించారు. దీంతో రామదాస్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఒకపక్క ప్రజా పోరాటం చేస్తూనే, మరోవైపు న్యాయ పోరాటం చేశారు. సుప్రీంతీర్పుపై రామ దాస్ స్పందిస్తూ ఇలా అన్నారు. ”హైకోర్టును సంప్ర దించినప్పటి నుంచి 366వ రోజులు చట్టపరమైన చర్యల కోసం పోరాటం చేశా. నేను అధికారికంగా మళ్ళీ విద్యార్థిని. 380 రోజుల పాటు నాకు విద్యను నిరాకరించింది” అని పేర్కొన్నారు. ఈ సమస్య ఎప్పుడూ ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదని, విద్యార్థుల ప్రాథమిక హక్కులు, ఉన్నత విద్యలో క్యాంపస్ ప్రజాస్వామ్య స్థితి గురించి అని ఆయన అన్నారు. ”విద్యార్థికీ విద్య నిరాకరించడమనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు” అని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి ఉద్య మాలకు తన చట్టపరమైన విజయాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. ఢిల్లీ అంబేద్కర్ విశ్వ విద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సంస్థాగత అణచి వేతను ప్రతిఘటించిన విద్యార్థులకు రామదాస్ సంఘీభావం తెలిపారు. తన మద్దతు ఇచ్చిన ముఖ్యంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరం (పీఎస్‌ఎఫ్) విద్యార్థి సంఘాలకు ఆయన కృతజ్ఞ తలు తెలిపారు. ”అందరికీ విద్య, ఉపాధి కోసం అధ్యయనం, పోరాటం తప్పకుండా కొనసాగు తుంది” అని పేర్కొన్నారు. టీఐఎస్‌ఎస్ ముంబయి లో పీఎస్‌ఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన రామదాస్ ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యు డిగా, ఎస్‌ఎఫ్‌ఐ మహారాష్ట్ర యూనిట్‌కు సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పును ఎస్‌ఎఫ్‌ఐ స్వాగతించింది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల గొంతులను అణచి వేసేందుకు, విద్యార్థి హక్కులను కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సానూ, మయూక్ బిశ్వాస్ అన్నారు. ఈ కుట్రలను ఛేదించేందుకు పోరాటమే మార్గమని స్పష్టం చేశారు.
రామదాస్ శివానందన్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
- Advertisement -
RELATED ARTICLES