- Advertisement -
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లా నయీంనగర్‌లోని ఓ ప్రయివేటు స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్(15) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రోజులాగే ఉదయం స్కూల్‌కి వెళ్ళిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. జ్వరంతో ఉన్న బాబు వామప్ చేయడం వల్ల బ్రీతింగ్ ఎక్కువై శ్వాస ఆడక అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. హుటాహుటిన స్కూల్ యాజమాన్యం హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే విద్యార్థి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న హనుమకొండ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -