నవతెలంగాణ – మంచిర్యాల
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని సుప్రియ అనుమానస్పదంగా ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర కు చెందిన ఎగ్గేవార్ రామోజీ, లక్ష్మి దంపతులు బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి వలస వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. రెండవ కూతురు సుప్రియ (14 ) ఆకెనపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే సుప్రియ గత వారం రోజులుగా స్కూల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటోందని తెలిపారు.
శుక్రవారం పాఠశాలకు వెళ్లొచ్చి పడుకుందని, శనివారం ఉదయం 4 గంటలకు బాత్రూంకు అనిలేచి క్రిమి సంహారక ట్యాబ్లేట్స్ మింగడంతో వాంతులు చేసుకుందని తెలిపారు. కాసేపటికి గమనించిన తల్లి తండ్రులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరిలించారు. అయితే చికిత్స పొందుతూ.. సుప్రియ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు .తొమ్మిదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానని పలుసార్లు ఇంట్లో సోదరితో అనేదని, అదే క్రమంలో మనస్థాపం చెంది మృతి చేంది ఉంటుందేమో అన్న అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES