- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు , గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ సమతుల్యం గురించి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. పరిశుభ్రత పచ్చదనంలో స్టేషన్ లో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం వెళ్లేంతవరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -