Sunday, February 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోపాల్ మండల కేంద్రంలో స్వచ్ భారత్

మోపాల్ మండల కేంద్రంలో స్వచ్ భారత్

- Advertisement -

నవతెలంగాణ-మోపాల్
మోపాల్ మండల కేంద్రంలోని చెత్తను పరిశుభ్రం చేసిన యోగ టీం సభ్యులు,మరియు చిన్నారులు..ఆదివారం గ్రామంలోని స్వచ్ఛ భారత్ నిర్వహించారు.. యోగా టీం సభ్యులు మరియు చిన్నారులు మాస్కులు ధరించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా యోగ శిక్షకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరియు యువకులు కూడా ‘స్వచ్ఛ భారత్’ పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా చేద్దాం అని తెలిపారు.పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటది అని ,ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యకుండా గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించి చెత్తను ట్రాక్టర్ లో వెయ్యాలనీ గ్రామ ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమంలో యోగ టీం సభ్యులు మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -