నవతెలంగాణ – ఆర్మూర్
మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శాస్త్రి నగర్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఏపుగా పెరిగిన చెట్లను తొలగించి కళాశాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి యువతరమై రేపటి మన భావిభారత నిర్మాణానికి సారథులని అటువంటి యువతను తీర్చిదిద్దే ఈ కళాశాలను పరి శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
ఈ స్వచ్ఛ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు పాల్గొనడం అభినందనీమన్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 20 వారాలు పూర్తి చేసుకున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు గంట గంగాధర్, కళాశాల విద్యార్థులు, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్ ప్రశాంత్, శ్యాసుంధర్, గణేష్, ముధుసుధన్, గుర్రం రాకేష్, వంట నరేష్, వేణు, పట్వారీ తులసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES