Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దికుంటలో స్వచ్ఛభారత్ 

మద్దికుంటలో స్వచ్ఛభారత్ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని మద్దికుంటలో స్వచ్ఛభారత్ లో భాగంగా వాటర్ ట్యాంకును , పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డుపైన గల వ్యర్థాలను గ్రామపంచాయతీ వాహనం ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ముత్యాల రాజు మాట్లాడుతూ… ప్రజలు ప్రతి ఒక్కరు తమ వ్యర్థాలను చెత్త బండి లో నే వేయాలని, రోడ్డుపై గాని, కాళీ ప్రదేశాల్లో వేయవద్దని కోరారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు లింగమాచారి, బిజెపి గ్రామ అధ్యక్షులు ఒరగంటి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు దులూరి శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ చింత శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -