నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని శాస్త్రీ నగర్ కాలనిలో తెలంగాణ ప్రభుత్వ షెడ్యుల్డు కులాల (బాలికల) కళాశాల వసతి గృహము ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహం ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్ల కొమ్మలు, చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 33 వారాలు పూర్తి చేసుకుందన్నారు.
ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి వారం నిర్వహించి శుభ్రతపై విద్యార్థులకు, కాలనీ వాసులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి ఆర్మూర్ స్వచ్ఛ ఆర్మూర్గా తీర్చిదిద్దాదడమే మా ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ కర్నాల సుజన ప్రియ, సిబ్బంది లావణ్య, కళాశాల విద్యార్థినీలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, నరేందర్, గణేష్, చోలా రాకేష్, కుతాడి ఎల్లయ్య, జంగిడి భోజన్న, శ్యాంసుందర్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.



