నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా 23వ ఆదివారం పట్టణంలోని ఫైర్ స్టేషన్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలను యువత ఆదర్శ తీసుకొని ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలన్నారు. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బోడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, గణేష్, శ్యాంసుధర్, ముధుసుధన్, నరేంధర్, ఎల్లయ్య, కృషివర్ధన్, నూకల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ఫైర్ స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES