Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

- Advertisement -

నవతెలంగాణ –  ఆర్మూర్ 
మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 24వ ఆదివారం  పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహం ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 24 వారాలు పూర్తి చేసుకుందన్నారు.

బాలికల వసతి గృహంలో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలకుగండా వసతి గృహం ఆవరణలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించామన్నారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థినిలు మాకు సహకరించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అభినందనీమన్నారు. మా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ సుమలత, సిబ్బంది మంగమ్మ, గంగామణి, రూపా, విద్యార్థినిలు, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బోడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, ముధుసుధన్, చోలా గుర్రం రాకేష్, ఎల్లయ్య, వేణు, కుకింగ్ నరేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -