హైదరాబాద్: రైల్వే స్టేషన్లలో ఆహార భద్రత, ఫుడ్ స్టాల్స్‌ను పరిశుభ్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యాపారస్థులకు తెలియజేసేందుకు దక్షిణమధ్య రైల్వే శాఖ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ హి సేవా’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సౌత్‌సెంట్రల్ రైల్వే పీసీఎండీ డాక్టర్ నిర్మల రాజారామ్ అధ్యక్షతన అవగాహన సదస్సును నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లోని ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేయడంతో పాటు ఆహార పదార్ధాల నాణ్యత, శుభ్రతపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సికింద్రాబాద్ డివిజన్ సీఎంఎస్ డాక్టర్ కె.నారాయణ స్వామి, సికింద్రాబాద్ ఏహెచ్‌ఓ హరికష్ణ, సికింద్రాబాద్, నాందేడ్, హైదరాబాద్ డివిజన్ ఎఫ్‌ఎస్‌ఓ జి.వెంకట హనుమంతరావు ఆహార భద్రత, ఫుడ్ స్టాల్స్‌ను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యాపారస్థులకు వివరించారు. రైల్వేశాఖ ప్రమాణాలను పాటించని వారిపె జరిమానాలు విధించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చర్లపల్లిలో ‘స్వచ్ఛ హి సేవా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES