Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల పరిశుభ్రతకే స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే

గ్రామాల పరిశుభ్రతకే స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే

- Advertisement -

ఎంపీడీవో సుమణ వాణి, ఎంపీఓ శ్రీధర్ రావు 
కాటాపూర్, కాల్వపల్లి గ్రామాల సర్వే 
నవతెలంగాణ – తాడ్వాయి 

గ్రామాల స్వచ్ఛత మెరుగుపరిచేందుకు స్వచ్ఛ సర్వేక్షన్ 2025 సర్వే చేపడుతున్నట్లు ఎంపీడీవో సుమణ వాని, ఎంపీ ఓ జాల శ్రీధర్ రావు లు అన్నారు. మండలంలోని పలు జీపీల్లో కేంద్ర సర్వే బృందం ఆధ్వర్యంలో “అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్”టీం సభ్యులు శుక్రవారం కాటాపూర్, కాల్వపల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త సేకరణ తీరు, పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తరలింపు, ప్రభుత్వ సంస్థల పనితీరు తదితర అంశాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి వివరాలను టీం సభ్యులు స్వీకరించారు. గ్రామాల్లోని నివాస గృహాలను సందర్శించి వారి అభిప్రాయాలను క్రోడీకరించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమనవాని, ఎంపీవో శ్రీధర్ రావు, జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ సర్వే కోఆర్డినేటర్ మైమున్నిసా, సర్ఫ్ న్నిసా, పంచాయతీ కార్యదర్శులు పిట్టల రవి, భాగ్యరాణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -