Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
స్వామి వివేకానంద జయంతి నీ పురస్కరించుకొని బార్ అసోసియేషన్ హాలు నందు సోమవారం పట్టణ బార్ అసోసియేషన్ హాల్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి జయంతిని జాతీయ యువజన దినోత్సవం గా నిర్వహించుకుంటామని, న్యాయవాదులు సైతం స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని వజ్రకఠోరమైన మనస్సు, ఉక్కు కండలు కలిగిన దేహ దారుఢ్యం కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యంతో పాటు, హాల్లాదంగా ఉండగలుగుతామని, ఎటువంటి సమస్యలు వచ్చిన ధైర్యంతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకోగలుగుతామని వక్తులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, గ్రంథాలయ కార్యదర్శి కుందారపు శ్రావణ్, సీనియర్ న్యాయవాదులు లోకా భూపతిరెడ్డి, గంగారెడ్డి, వి. జగదీశ్వర్ రెడ్డి,ఎస్ శ్రీధర్, కృష్ణ పండిత్, చిలుక కిష్టయ్య, గంటా విప్లవ్, వి వెంకటేష్, జె మురళీధర్, రుయ్యాడి రాజేశ్వర్, బేతు జగదీష్, వెంకట్రావు షిండే, జి జి రామ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -