Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వివేకానంద స్వామి జయంతి వేడుకలు

ఘనంగా వివేకానంద స్వామి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రంలో సోమవారము స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహానికి మాజీ ఎంపీపీ నల్ల సారిక హన్మంత్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళలు అర్పించారు. 2012లో హన్మంత్ రెడ్డి క్లాస్మెంట్లు 1989-90 కి చెందిన ఎస్ ఎస్ స్సి బ్యాచ్ వారు అప్పట్లో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో సదశివ్, గంగమోహన్, ధర్మేందర్, జిల్లా రమేష్, మద్నూరి నరేందర్, ఏముల రాజేశ్వర్, ప్రకాష్, ప్రవీణ్, బిఆర్ ఎస్ నాయకులు, నజీర్, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -