నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడం పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బాద్ మారి విజయ కుమారి సంజు, ఉప సర్పంచ్ పావుడే సవిత బస్వంత్ ఆధ్వర్యంలో యువజన సంఘం నాయకులు హన్మాజీవార్ సంగ్రామ్ స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాలలో యువత విద్యను అభ్యసించినప్పుడే తమ మార్గం నిర్దేశాలను చేరుకోగలుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో నడుచు కోవాలని సూచించారు. యువజన నాయకుడు హెచ్ సంగ్రాం మాట్లాడుతూ యువత ప్రతి ఒక్క రూ దేశ సంరక్షణ ఆలోచించాలని, అభ్యసించిన విద్యను ఎమ్మార్గంలో ఉండేందుకు క్రమశిక్షణగా మేలుగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వాగ్మారే లక్ష్మణ్, మాదయప్ప, చాకలి యాదవ్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



