నవతెలంగాణ-ఆలేరుటౌను: ఆలేరు మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు..మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఎన్నికల అధికారి ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.రెండో వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ అంగడి ఆంజనేయులు, ఏడో వార్డు కౌన్సిలర్ బీజన బాలమని,9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు,10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత,11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్,12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజ, ఆలేరు మున్సిపల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఆర్డిఓప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,మేనేజర్ జగన్మోహన్, సహాయ అధికారి దూడల వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




