నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్స్ లతో ప్రమాణ స్వీకరణ ఈ నెల 16 న చేయించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం రోజు కలెక్టరేట్ లోని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారి చాంబర్లో మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో బాగంగా ఎన్నికైన వార్డ్ కౌన్సిలర్లు , ఎక్స్ ఆఫీసియో సభ్యులు అందరూ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకై ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 16 న ప్రమాణస్వీకారం చేయనున్న వార్డు కౌన్సిలర్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని , వార్డు కౌన్సిల్స్ మొత్తం ప్రమాణ స్వీకారం చేయాలని తెలిపారు.
చైర్మన్, వైస్ చైర్మన్ లకు పార్టీ ఏ అండ్ బి ఫారం లు జారీ చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమయ పాలన పాటించి ఉదయం 11 గంటలకు అందరూ సభ్యులు ఎన్నికైన వార్డు కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రొసీజర్ ప్రకారం నిర్వహించాలని సూచన చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయాలని పేర్కొన్నారు. ఎన్నిక కై ఆధరైజ్ గా ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక అధికారిని నియమించడం జరిగిందని, భువనగిరి మున్సిపాలిటీ ఆర్థరైజ్డ్ ఆఫీసర్ గా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, పోచంపల్లి మున్సిపాలిటీ కి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి ఆర్డిఓ కృష్ణారెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఆర్డిఓ శేఖర్ రెడ్డి, మోత్కూర్ మున్సిపాలిటీకి సంబంధించి అడిషనల్ డిఆర్డిఓ సురేష్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


