కుల్దీప్‌కు మూడు వికెట్లు
దక్షిణాఫ్రికా 247/6
స్టబ్స్, బువుమా అద్భుత పోరాటం
గౌహతి : రెండో టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు వ్యూహాలు ఫలించలేదు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. భారత బౌలర్లు తొలి రెండు వికెట్లను త్వరగా సాధించినా.. ఆ తర్వాత భారత బౌలర్లకు స్టబ్స్, బవుమా అడ్డుగా నిలిచారు. వీరిద్దరిని పెవీలియన్‌కు పంపేందుకు భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 6వికెట్ల నష్టానికి 247పరుగులు చేసింది. పిచ్ బౌలర్లకు పెద్దగా అనుకూలించకపోవడంతో సొమ్ముచేసుకున్న సఫారీ కెప్టెన్ తెంబా బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49)లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు రియాన్ రికెల్టన్(35), ఎడెన్ మర్క్‌రమ్(38)లు శుభారంభమిచ్చారు. తొలి సెషన్‌లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ వికెట్ ఇవ్వలేదు. క్రీజులో కుదురుకున్న మర్‌క్రమ్‌ను రెండో సెషన్‌లో బుమ్రా వెనక్కి పంపి తొలి వికెట్ అందించాడు. దీంతో తొలివికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కుల్దీప్ ఓవర్లో రికెల్టన్ వికెట్ కీపర్ పంత్‌కు దొరికాడు. ఓపెనర్లు ఔటైనా సఫారీ టీమ్ తడబడలేదు.
క్రీజులోకి వచ్చిన బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని జడేజా(1-/30) విడదీసాడు. అర్ధ శతకానికి చేరువైన స్టబ్స్‌ను కుల్దీప్(3/48) బోల్తా కొట్టించాడు. స్లిప్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోగా 187 వద్ద నాలుగో వికెట్ పడింది. ఆ తర్వాత టోనీ జోర్జి(28), ముత్తుస్వామి(25 నాటౌట్)లు దక్షిణాఫ్రికా వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలిచారు. అయితే.. రెండో కొత్త బంతితో సిరాజ్ బ్రేకిచ్చాడు. జోర్జి ఆడిన బంతిని పంత్ కుడివైపు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దాంతో.. 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా 246 వద్ద పర్యాటక జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు కుల్దీప్‌కు మూడు, జడేజా, సిరాజ్, బుమ్రాకు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్‌క్రమ్ (బి)బుమ్రా 38, రికెల్టన్ (సి)పంత్ (బి)కుల్దీప్ 35, స్టబ్స్ (సి)రాహుల్ (బి)కుల్దీప్ 49, బవుమా (సి)జైస్వాల్ (బి)జడేజా 41, జోర్జి (సి)పంత్ (బి)సిరాజ్ 28, ముల్డర్ (సి)జైస్వాల్ (బి)కుల్దీప్ 13, ముత్తుసామి (బ్యాటింగ్) 25, వెర్రెయనె (బ్యాటింగ్) 1, అదనం 17. (81.5ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 247పరుగులు.
వికెట్ల పతనం: 1/82, 2/82, 3/166, 4/187, 5/201, 6/246
బౌలింగ్: బుమ్రా 17-6-38-1, సిరాజ్ 17.5-3-59-1, నితీశ్ రెడ్డి 4-0-21-0, సుందర్ 14-3-36-0, కుల్దీప్ 17-3-48-3, జడేజా 12-1-30-1.



