- Advertisement -
హైదరాబాద్ : పండుగ సీజన్‌లో ఆన్ డిమాండ్ తక్షణ బహుమతుల ప్లాట్‌ఫాం ‘గిఫ్టబుల్స్’ను ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రస్తుతం దీన్ని బెంగళూరులో అందుబాటులోకి తెచ్చామని.. త్వరలోనే మరిన్ని మెట్రో నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. కేకులు, పువ్వులు, ఎలక్ట్రానిక్స్ తదితర 10వేల పైగా ఉత్పత్తులను ఒకే ఆర్డర్‌లో 10-60 నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు ఆ కంపెనీ స్విగ్గీ సహవ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు.
- Advertisement -