Monday, September 29, 2025
E-PAPER
Homeబీజినెస్రైలులో ఆహారం కోసం కొత్త ఫీచర్లను ప్రారంభించిన స్విగ్గీ

రైలులో ఆహారం కోసం కొత్త ఫీచర్లను ప్రారంభించిన స్విగ్గీ

- Advertisement -
  • – ప్రయాణికులు 115+ స్టేషన్లలో ప్రయాణిస్తున్నప్పుడు స్విగ్గీ యాప్ పై వారు ‘సిటీ బెస్ట్’ ఆహారం కోసం ఆర్డర్ చేయవచ్చు
  • – రైలులో ఇబ్బందిరహితమైన భోజన అనుభవం కోసం ఈజీ ఈట్స్ ను ప్రారంభించింది
  • – రైలులో ఆహారం కోసం ఆర్డర్లు ఇవ్వడంపై ఉత్తమమైన డీల్స్ కోసం సరికొత్త ఆఫర్ జోన్
  • – శాకాహారులు మరియు ఈ నవరాత్రికి ఉపవాసం ఉన్న వారి కోసం స్వచ్ఛమైన శాకాహారం విభాగం ప్రారంభమైంది
  • నవతెలంగాణ – బెంగళూరు: స్విగ్గీ (స్విగ్గీ లిమిటెడ్, NSE: SWIGGY/BSE: 544285), భారతదేశపు ప్రముఖ ఆన్ –డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం రైలులో ఆహారం సేవల కోసం కొత్త ఫీచర్లను ఈరోజు ప్రకటించింది. పండగ సీజన్ లో, స్విగ్గీ తెలివైన, మరింత వ్యక్తిగత మెనూ ఎంపికలను ప్రారంభించింది, భారతదేశంవ్యాప్తంగా లక్షలాది రైలు ప్రయాణికులకు ఉత్తేజభరితమైన కొత్త వంటకాల అనుభవాన్ని తీసుకువస్తోంది. వారు స్టేషన్లలో పేరెన్నిక గన్న ఈటరీస్ యొక్క ప్రత్యేకమైన జాబితా నుండి తయారైన ‘సిటీ బెస్ట్’ వంటకాల శ్రేణి నుండి ఎంచుకోవచ్చు. ఇంకా,  రైలులో ఇబ్బంది లేని  భోజన అనుభవాన్ని నిర్థారించడానికి స్విగ్గీ ఈజీ ఈట్స్ ను కూడా ప్రారంభించింది.  స్విగ్గీ వారి ఈజీ ఈట్స్  ఎంపిక ప్రత్యేకంగా  రైలులో భోజన అనుభవం కోసం ఎంపిక చేయబడింది. సలాద్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం నుండి ఫ్రైస్ మరియు నాచోస్ వంటి ఫన్ మంచీస్ వరకు ఈ భోజనం చక్కని, సౌకర్యవంతమైన ప్యాకేజింగ్ లో హామీ ఇవ్వబడిన కట్లరీ కిట్ తో లభిస్తుంది.

ఇంకా, శాకాహారానికి ప్రాధాన్యతనిచ్చే వారు లేదా నవరాత్రుల సమయంలో ఉపవాసాలు ఉన్న వారి కోసం స్విగ్గీ ప్రత్యేకమైన స్వచ్ఛమైన శాకాహారం కూడా ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ రుచికరమైన, నమ్మకమైన 100% శాకాహారం భోజనాలను గుర్తించడం సులభం చేస్తుంది. అంతే కాదు. ఈ పండగ సీజన్ లో, ప్రయాణికులు సరికొత్త ఆఫర్ జోన్ తో స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆన్ ట్రైన్ (రైలులో ఆహారం) తమ ఆహారంపై గొప్ప విలువను కనుగొనవచ్చు. ఈ ప్రత్యేకమైన విభాగం ఏ స్టేషన్ లో అయినా ప్రయాణికులు ప్రముఖ రెస్టారెంట్లలో 60% వరకు సహా వెంటనే 30+ ఉత్తమమైన డీల్స్ ను పొందడానికి అవకాశం ఇస్తుంది. రుచికరమైన భోజనాలపై సులభంగా ఆదాలు చేస్తుంది.

ఈ పండగ సీజన్ లో, రైలు ప్రయాణికులు 5,000 వంటకాల రకం నుండి తమ సరైన ఆహారాన్ని ఎంచుకోవచ్చు మరియు 115+ స్టేషన్ల నుండి రైలులో తమ సీటు వద్దకు వాటిని డెలివరీ చేయించుకోవచ్చు! అహ్మదాబాద్ లో సంప్రదాయబద్ధమైన థాలీ కావచ్చు లేదా పశ్చిమ బెంగాల్ లో  రుచికరమైన సముద్ర ఆహారం కూర కావచ్చు, ప్రయాణికుల రైలు సీటు వద్దకు నేరుగా భారతదేశపు ఉత్తమమైన స్థానిక రుచులను మేము తీసుకువస్తున్నాం.

పండగ సీజన్ లో ప్రారంభించిన కొత్త ఫీచర్లపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ. దీపక్ మలూ, విపి-ఫుడ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ & న్యూ ఇనీషియేటివ్స్, స్విగ్గీ, ఇలా అన్నారు, “మా కస్టమర్లు కోరుకున్నది మేము విన్నాము మరియు ప్రతి ప్రయాణం రుచికరమైన, సౌకర్యవంతమైన మరియు నిజమైన ప్రత్యేకతను చేయడానికి రూపొందించబడిన తెలివైన, మరింత వ్యక్తిగత భోజన ఎంపికలను ప్రారంభించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. సిటీ బెస్ట్ తో, మేము  ఆర్డరింగ్ నుండి ఊహించిన పనిని తొలగించాము, కాబట్టి ప్రయాణికులు తమ అద్భుతమైన ఆహారం, పరిశుభ్రత మరియు ఉదారమైన భాగాలకు ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ భాగస్వాముల నుండి విశ్వశనీయమైన, అధిక నాణ్యత గల భోజన ఎంపికలను సులభంగా కనుగొనవచ్చు. అదే విధంగా, ఈజీ ఈట్స్ తో, ప్రయాణంలో గందరగోళపరిచే, అసౌకర్యమైన భోజనాల సమస్యని మేము పరిష్కరిస్తున్నాం. మా స్వచ్ఛమైన శాకాహారం విభాగం శాకాహార ప్రయాణికులకు మనశ్సాంతిని ఇస్తుంది. మొత్తంగా, మన అందరికీ తెలిసిన  ఆసక్తికరమైనది మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం: ప్రయాణం గమ్యస్థానం అంత ప్రధానమైనది!”

జాగ్రత్తగా ఎంపిక చేసిన ఎంపికలను కలపడం, నమ్మకమైన నాణ్యత మరియు నిరంతర టెక్నాలజీ ద్వారా, స్విగ్గీ కస్టమర్లు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా సరైన ఎంపికను చేసుకున్నారని తెలుసుకుని, ఆర్డర్లను వేగంగా చేయడంలో సహాయపడటానికి అంకితభావంతో ఉంది. ఈ ఫీచర్లు ఆహారాన్ని కనుగొనడం సులభం మరియు మరింత ఆనందకరంగా చేయగా, యూజర్లు 25% వరకు వేగంగా ఆర్డర్ చేయగలరు. స్విగ్గీ వారి అభివృద్ధి చేయబడిన  ఫుడ్ ఆన్  ట్రైన్ పేజీ ఇంటర్నెట్ సక్రమంగా లేని  పరిస్థితిలో కూడా వేగంగా పని సే విధంగా తయారైంది.

భారతదేసపు దూర ప్రయామాలు చేసే రైళ్లు సుమారు 16 లక్షల మంది రిజర్వ్ డ్ ప్రయాణికులను ప్రతి ఒక్క రోజు తీసుకువెళ్తాయి. చాలామందికి, భోజనాలను  ఎంపిక చేసుకోవడం అనేది ప్యాంట్రీ కారు ఆహారానికి లేదా స్టేషన్ స్టాల్స్ లో ఏది  లభ్యమైతే దానికి మాత్రమే పరిమితమయ్యాయి, ఈ రెండిటిలో సౌకర్యం, రకాలు, పరిశుభ్రతలు తరచుగా తక్కువగా ఉంటాయి. ఈ లోటును తీర్చడానికి స్విగ్గీ వారి ఫుడ్ ఆన్ ట్రైన్ సేవలు ఇప్పటికే ప్రవేశించాయి. నేరుగా రైళ్లల్లోని సీట్ల వద్దకే 115+ స్టేషన్ల నుండి నమ్మకమైన స్థానిక రెస్టారెంట్ భాగస్వాములు నేరుగా వేడి భోజనాలు అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -