నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్ ధరలను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా సిలిండర్ల డెలవరీ గడువులను కూడా పెంచి, డొమిస్టక్, కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్(పీఎన్జీ) సరఫరా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెంటనే దానికి మారాలని ఆయా వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. దేశంలో పీఎన్జీని ప్రోత్సహించే దిశగా ముందడుగు వేస్తున్న కేంద్రం.. ఈ మేరకు 3 నెలల గడువు నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది.
పీఎన్జీకి మారండి..లేకుంటే ఎల్పీజీ కట్: కేంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



