నవతెలంగాణ-హైదరాబాద్: సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ – షరా త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు 80 ఏళ్ల తర్వాత సిరియా అధ్యక్షులు వైట్ హౌస్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని సిరియా విదేశాంగ మంత్రి అసద్ అల్ – షైబానీ ఆదివారం వెల్లడించారు. అధ్యక్షుడు అహ్మద్ అల్ – షరా పర్యటన బహుశా నవంబర్ 10 తేదీల్లో ఉండొచ్చని సిరియా అమెరికా ప్రత్యేక రాయబారి థామస్ బరాక్ శనివారం తెలిపారు.
కాగా, బషర్ అల్- అసద్ ప్రభుత్వ కాలంలో సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలనే దానిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు చర్చలు జరపనున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్ అల్ షైబానీ తెలిపారు. గతంలో అల్ – ఖైదా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న అల్ – నుప్రా ఫ్రంట్ వారసుడైన హయత్ తహ్రీర్ అల్- షామ్ నేతృత్వంలో బషర్ అల్- అసద్ ప్రభుత్వంపై తిరుగుబాటు దాడి చేశారు. దీంతో ఆయన డిసెంబర్ 8న ఆయన పదవీచ్యుతుడయ్యారు.
ఆంక్షల చట్టాల వల్ల ఇప్పటికీ ఉగ్రవాదానికి కేంద్రంగా సిరియానే వర్గీకరించబడుతుంది. ఇకపై ఇలాంటి ఆంక్షల చట్టాలు ఉనికిలో ఉంకూడదని.. అటువంటి విధానాలే కొత్త ప్రభుత్వ లక్ష్యమని అహ్మద్ షైబానీ అన్నారు. సిరియాలో చురుకుగా ఉన్న ఉగ్రవాద గ్రూపు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ను ఎదుర్కోవడానికి సిరియా అంతర్జాతీయ మద్దతును కోరుతుందన్నారు. ఉగ్రవాదం ద్వారా ఎంతో నష్టపోయిన సిరియాను మళ్లీ పునర్నిర్మాచాలంటే.. దానికి కావాల్సింది మానవతా సహాయం కంటే.. పెట్టుబడులే ముఖ్యం. సిరియా పునర్నిర్మాణానికి పెట్టుబడుల పైన దృష్టి పెట్టేలా వాషింగ్టన్‌లో చర్చలు జరుగుతాయని అల్ షైబానీ అన్నారు.



