నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ ప్రచారానికి ఏడుగురు ఎంపీలతో కూడిన బృందాన్ని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ పై దౌత్య యుద్దానికి.. తనకు అవకాశం ఇవ్వడం గౌరవంగా ఉందన్నారు . ఐదు కీలక రాజధానులకు ఆల్-పార్టీ బృందానికి నాయకత్వం వహించమని ప్రభుత్వం ఆహ్వానించడం గౌరవంగా ఉందని తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం తన సేవలు అవసరమైతే, తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఏడు ఆల్-పార్టీ ప్రతినిధి బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లనుంది.
నాకు అవకాశం ఇవ్వడం గౌరవంగా ఉంది: ఎంపీ శశి థరూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES