నవతెలంగాణ-హైదరాబాద్: 2026 టీ 20 ప్రపంచకప్‌కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ ఐసీసీ ఈవెంట్ భారతదేశంలో జరగనుండడంతో, జట్టులో ఎంపికైన 15 మందిని బోర్డు శనివారం విడుదల చేసింది. ఈ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా ఆడనుంది.
శుభ్‌మన్ గిల్ కు దక్కని చోటు ….
ఇప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు ఈసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అతడికి స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ను సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా నియమించారు. అంతే కాకుండా, జితేశ్ శర్మ గురించి కూడా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. జితేశ్ శర్మ జట్టులో చోటు కోల్పోయిన నేపథ్యంలో …. నూతనంగా వచ్చిన ఇషాన్ కిషన్ జట్టులో చేరాడు. జితేశ్‌ను వదిలి, దేశీ టీ20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన ఇషాన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకున్నాయి. ఇక, రింకూ సింగ్ కూడా మేనేజ్‌మెంట్ నుంచి కొత్తగా జట్టులో చోటు పొందాడు.
2026 టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యులు …
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
అభిషేక్ శర్మ
సంజూ శాంసన్ (వికెట్ కీపర్)
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్యా
శివం దూబే
అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్)
వాషింగ్టన్ సుందర్
వరుణ్ చక్రవర్తి
కుల్దీప్ యాదవ్
జస్‌ప్రీత్ బుమ్రా
అర్ష్‌దీప్ సింగ్
హర్షిత్ రాణా
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
రింకూ సింగ్
బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొని ఈ జట్టును ప్రకటించారు.
ప్రపంచకప్ షెడ్యూల్ …. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 మధ్య జరగనుంది.



