నవతెలంగాణ-హైదరాబాద్: తొలి పోరులో ఇంగ్లాండ్ జట్టను వణికించిన నేపాల్..ఇటలీపై ఘోర పరాజయం పొందింది. వాంఖడే వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 19.3 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఆరిఫ్ షేక్(27) టాప్ స్కోరర్. ఆసిఫ్ షేక్(20), రోహిత్ పాడెల్(23) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ 3, బెన్ మానేంటి 2, అలీ హసన్, స్మట్స్, జస్‌ప్రీత్ సింగ్ తలొక వికెట్ పడగొట్టారు. ఇటలీ ఓపెనర్లు జస్టిన్ మోస్కా(60), ఆంథోనీ మోస్కా(62) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. నేపాల్ నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించారు. ఎట్టకేలకు ఇటలీ జట్టు గ్రూప్ స్టేజిలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
T20 WORLD CUP: నేపాల్‌పై ఇటలీ గెలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



