- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం అపరిశుభ్రంగా మారింది. కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి వెళ్ళేటప్పుడు పైకి ఎక్కుతున్న మెట్ల మధ్యలో మూలకు గుట్కాలు, అంబార్ నమిలి అపరిశుభ్రంగా చేశారు. అలాగే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి కంపుకొడుతున్నాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో సందడిగా ఉండే ఎంపీడీఓ కార్యాలయంలో గుట్కాలు నమిలి ఇంత అపరిశుభ్రంగా మార్చింది ఎవరబ్బాని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.
- Advertisement -



